Industrial production: ఏప్రిల్‌ పారిశ్రామికోత్పత్తిలో 13.4 శాతం వృద్ధి

April Month IIP Grew by 13pc

  • గత ఏడాది లాక్‌డౌన్ నేపథ్యంలో స్తంభించిన పరిశ్రమలు
  • ఈ నేపథ్యంలోనే ఈసారి భారీ పెరుగుదల
  • పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 126.6గా నమోదు
  • క్రితం ఏడాది ఐఐపీ 54.0
  • 8 కీలక రంగాల ఉత్పత్తిలో 56.1 శాతం వృద్ధి

ఏప్రిల్‌ నెల పారిశ్రామిక కార్యకలాపాలు క్రితం ఏడాది అదే నెలతో పోలిస్తే 13.4 శాతం మేర పుంజుకున్నాయి. గత సంవత్సరం కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో పారిశ్రామిక కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈసారి భారీ పెరుగుదల కనిపించింది. ఏప్రిల్‌ నెల పారిశ్రామికోత్పత్తి సూచీ(ఐఐపీ) 126.6గా నమోదైంది. క్రితం ఏడాది ఇది 54.0గా వుంది.

ఇక మైనింగ్‌, తయారీ, విద్యుత్తు రంగాల్లో ఐఐపీ వరుసగా.. 108.0, 125.1, 174.0గా నమోదైంది. ఇక పారిశ్రామికోత్పత్తిలో 40 శాతం వాటా కలిగిన ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తిలో 56.1 శాతం వృద్ధి రికార్డయ్యింది.

  • Loading...

More Telugu News