'బింబిసార'లో ఎన్టీఆర్ వాయిస్!
- చారిత్రక నేపథ్యంలో 'బింబిసార'
- భారీ బడ్జెట్ తో కల్యాణ్ రామ్
- స్క్రిప్ట్ దశ నుంచి ఎన్టీఆర్ సూచనలు
- ప్రమోషన్స్ పరంగాను హెల్ప్
మొదటి నుంచి కూడా ఈ సినిమా విషయంలో కల్యాణ్ రామ్ ను ఎన్టీఆర్ పూర్తిస్థాయిలో సపోర్ట్ చేస్తూ వస్తున్నాడట. కల్యాణ్ రామ్ తో పాటు ఎన్టీఆర్ కూడా కథను వినడం, మూలకథ దెబ్బతినకుండా మార్పులు .. చేర్పులు సూచించడం చేశాడట. ఇక ఈ సినిమా కోసం ఎన్టీఆర్ 'వాయిస్ ఓవర్' ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. కథ మలుపు తిరిగే క్రమంలో ఆయన వాయిస్ వినిపిస్తుందని అంటున్నారు. సినిమా ప్రమోషన్స్ సమయంలోను తన వంతు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతోనే ఎన్టీఆర్ ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు.