china: విద్యార్థులు, ఉద్యోగ, వ్యాపారస్థులను అనుమతించాలని చైనాకు భారత్ విజ్ఞప్తి

China bars indians despite taking chinese jab

  • భారతీయుల ప్రయాణాలపై చైనా నిషేధం
  • తాత్కాలికమేనని ప్రకటన
  • చైనా వ్యాక్సిన్‌ తీసుకుంటే అనుమతిస్తామని మార్చిలో వెల్లడి
  • వీసా కోసం అనేక  మంది విద్యార్థులు, ఉద్యోగుల దరఖాస్తు
  • చైనా ప్రభుత్వంతో భారత్‌ సంప్రదింపులు

చైనాలో అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్లు తీసుకోవడం సహా ఇతర షరతులకు లోబడి ఉన్న విద్యార్థులు, ఉద్యోగ-వ్యాపారస్థులను తమ దేశంలోకి అనుమతించాలని చైనా ప్రభుత్వానికి భారత్‌ విజ్ఞప్తి చేసింది. తమ దేశంలో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను తీసుకున్న వారిని చైనాలోకి అనుమతించే అంశాన్ని పరిశీలిస్తామని భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం చెప్పినట్లు ఈ సందర్భంగా కేంద్ర విదేశాంగ శాఖ గుర్తుచేసింది.

ప్రస్తుతం చైనా వెళ్లేవారిని భారత్ అనుమతిస్తోంది. చైనా దేశస్థులు సైతం భారత్‌కు వస్తున్నారు. కానీ, చైనా మాత్రం భారతీయులను ఇంకా అనుమతించడం లేదు. ప్రస్తుతం ఉన్న వీసాలను రద్దు చేస్తూ చైనా నవంబరులో ఉత్తర్వులు జారీ చేసింది. భారతీయుల ప్రయాణాలపై నిషేధం విధించింది. ఇది తాత్కాలికమేనని పేర్కొంది.

మార్చిలో చైనా రాయబార కార్యాలయం చెప్పినట్లుగా చైనా వ్యాక్సిన్లు తీసుకున్నప్పటికీ వీసాలు మాత్రం ఇంకా జారీ చేయడం లేదని విదేశాంగ శాఖ తెలిపింది. ఇప్పటికే అనేక మంది వీసాల కోసం దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వ యంత్రాంగం చైనా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News