MSP: వరిపై కనీస మద్దతు ధరను పెంచిన కేంద్రం

MSP of paddy has been ncreased to rs 72

  • క్వింటాపై రూ.72 పెంపు
  • మరికొన్ని పంటలకూ ఎంఎస్‌పీ పెంపు
  • మోదీ నేతృత్వంలో కేబినెట్‌ నిర్ణయం
  • కనీస మద్దతు ధర కొనసాగుతుందని హామీ

వరి కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)ని క్వింటాకు రూ.72 పెంచుతూ కేంద్ర కేబినెట్‌ బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో 2021-22 సాగు సీజన్‌లో క్వింటాల్‌ వరికి రూ.1,940 ధర లభించనుంది. అలాగే మరికొన్ని ఖరీఫ్‌ పంటలపై సైతం కేంద్రం కనీస మద్దతు ధరను పెంచింది. అలాగే బాజ్రా క్వింటా ధరను రూ.2,150 నుంచి రూ.2,250కి పెంచారు.

ప్రధాని మోదీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు. నైరుతి రుతుపవనాల రాకతో వరి సాగు సీజన్‌ ప్రారంభమైంది.

ఈ సందర్భంగా తోమర్‌ విలేకరులతో మాట్లాడుతూ.. కనీస మద్దతు ధర భవిష్యత్తులోనూ కొనసాగుతుందని హామీ ఇచ్చారు. కొత్త సాగు చట్టాలు అమల్లోకి వస్తే ఎంఎస్‌పీని రద్దు చేస్తారని రైతు సంఘాల నుంచి అభ్యంతరం వ్యక్తమయిన విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News