Nepal: రామ్‌దేవ్ బాబాకు వరుస దెబ్బలు.. కరోనిల్‌పై నిషేధం విధించిన నేపాల్
- కరోనా కట్టడి కోసం కరోనిల్‌ను అభివృద్ధి చేసిన పతంజలి
- కరోనిల్‌ను నిషేధించిన భూటాన్
- వైరస్ కట్టడిలో కరోనిల్ విఫలమైందన్న నేపాల్
- నిషేధిస్తూ ఆదేశాలు జారీ
యోగా గురు రామ్‌దేవ్ బాబా సంస్థ పతంజలి కరోనా కోసం తీసుకొచ్చిన కరోనిల్ మందుకు వరుస దెబ్బలు తగులుతున్నాయి. భూటాన్ ఇప్పటికే ఈ మందుపై నిషేధం విధించగా తాజాగా, నేపాల్ కూడా అలాంటి నిర్ణయమే తీసుకుంది. కరోనా వైరస్‌ను నివారించడంలో కరోనిల్ విఫలమైందని, కాబట్టి రామ్‌దేవ్ బాబా బహుమతిగా పంపిన 1,500 కిట్లను వాడకూడదని నేపాల్ నిర్ణయించింది. కరోనా కిట్‌లోని ట్యాబ్లెట్లు, నూనె కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో విఫలమయ్యాయని పేర్కొన్న నేపాల్ ఆయుర్వేద మంత్రిత్వశాఖ కరోనిల్‌ను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.