UAE: భారత విమానాలపై నిషేధాన్ని పొడిగించిన యూఏఈ
- ఇప్పటికే భారత విమానాలపై నిషేధం విధించిన యూఏఈ
- కరోనా నేపథ్యంలో నిషేధం మరోసారి పొడిగింపు
- దుబాయ్ నుంచి ఇండియాకు విమానాలు వెళ్లడానికి అనుమతి
కరోనా నేపథ్యంలో భారత్ నుంచి వచ్చే విమాన రాకపోకలపై యూఏఈ ఇప్పటికే నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ నిషేధాన్ని యూఏఈ పొడిగించింది. ఏప్రిల్ 24న యూఏఈ ఈ నిషేధాన్ని విధించింది. ఇప్పటి వరకు నిషేధాన్ని రెండు సార్లు పొడిగించింది.
ప్రస్తుతం దుబాయ్ నుంచి భారత్ కు విమానాలు వెళ్లడానికి అనుమతి ఉన్నప్పటికీ... భారత్ నుంచి వచ్చే విమానాలపై మాత్రం నిషేధం ఉంది. యూఏఈ పౌరులు, దౌత్యవేత్తలు, ఎంపిక చేసిన గోల్డెన్ వీసా హోల్డర్లను మాత్రమే ఇండియా నుంచి యూఏఈకి తిరిగొచ్చేందుకు అనుమతిస్తున్నారు.
ప్రస్తుతం ఇండియాలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో, విమాన రాకపోకలపై నిషేధాన్ని యూఏఈ మరోసారి కూడా పొడిగించే అవకాశాలు లేకపోలేదని విమానయాన మంత్రిత్వ శాఖ అధికారవర్గాలు చెపుతున్నాయి.