rain: తెలంగాణ‌లోని ప‌లు జిల్లాల్లో భారీ వ‌ర్షాలు

rains in ts

  • కరీంనగర్, హుజూరాబాద్, వరంగల్ లలో వ‌ర్షాలు
  • రానున్న‌ మూడు రోజుల్లో విస్తారంగా వ‌ర్షాలు
  • తెలంగాణ‌లోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు  

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు తెల్ల‌వారుజాము నుంచి వర్షాలు కురుస్తున్నాయి. మ‌రికొన్ని ప్రాంతాల్లో గ‌త రాత్రి నుంచి వ‌ర్షాలు కురుస్తుండ‌డంతో లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరీంనగర్, హుజూరాబాద్, జమ్మికుంట, వేములవాడ, హన్మకొండ, ఖాజీపేట, మణికొండ, ఆత్మకూరు, పరకాల, నర్సంపేట మండలాల్లో భారీ వ‌ర్షం కురుస్తోంది. వరంగల్ నగరంలోని పలు ప్రాంతాల్లో రహదారులపై నీళ్లు నిలిచాయి.

 కాగా,  రానున్న‌ రెండు మూడు రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి నైరుతి రుతుపవనాలు పూర్తిగా ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే, ఈనెల 11న ఏర్పడబోయే అల్పపీడన ప్రభావంతో మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తెలంగాణ‌లోని ఉత్తర, తూర్పు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశముందని తెలిపింది.  

rain
Telangana
Andhra Pradesh
  • Loading...

More Telugu News