Jagan: 'జగనన్న తోడు' రెండో విడత రుణాలు విడుదల చేసిన సీఎం జగన్

CM Jagan releases second phase loans from Jagananna Thodu scheme

  • రూ.370 కోట్లు విడుదల చేసిన సీఎం జగన్
  • 3.7 లక్షల మందికి రూ.10 వేల చొప్పున రుణం
  • ఇప్పటివరకు మొత్తం 9.05 లక్షల మందికి లబ్ది
  • ఈ రుణాలపై వడ్డీని ప్రభుత్వమే భరిస్తుందన్న సీఎం

చిరు వ్యాపారులను ఆదుకునే ఉద్దేశంతో రూపొందించిన 'జగనన్న తోడు' పథకంలో భాగంగా రెండో విడత రుణాలను సీఎం జగన్ నేడు విడుదల చేశారు. రాష్ట్రంలోని 3.7 లక్షల మంది చిరువ్యాపారుల కోసం రూ.370 కోట్లు విడుదల చేశారు. ఒక్క క్లిక్ తో రూ.10 వేల చొప్పున వారి ఖాతాల్లో జమ చేశారు. దీంతో, రెండు దశల్లో కలిపి మొత్తం 9.05 లక్షల మందికి రూ.905 కోట్ల మేర వడ్డీ లేని రుణాలు అందినట్టయింది.

దీనిపై సీఎం జగన్ మాట్లాడుతూ, ఎంతోమంది చిరువ్యాపారులు బ్యాంకు రుణాలు పుట్టక, బయట అధిక వడ్డీ రుణాలపై ఆధారపడి నష్టపోయే పరిస్థితులను పాదయాత్రలో కళ్లారా చూశానని వెల్లడించారు. ఈ పరిస్థితిని మార్చుతానని నాడు మాట ఇచ్చానని, ఆ మేరకు హామీ నిలుపుకుంటూ 'జగనన్న తోడు' కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు. ఈ పథకంలో ఇచ్చే రుణాలపై వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News