సూర్య కొత్త సినిమా అప్ డేట్!
- విభిన్నమైన కథా చిత్రంలో సూర్య
- 35 శాతం చిత్రీకరణ పూర్తి
- దర్శకుడిగా పాండిరాజ్
- జులైలో టైటిల్ ప్రకటన
"ఇది ఒక విభిన్నమైన కథా చిత్రం .. ఇందులో సూర్య డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాడు. ఆయన పాత్రలో వేరియేషన్స్ ఉంటాయి. ఇంతవరకూ సూర్య ఈ తరహా కథనుగానీ .. పాత్రనుగాని చేయలేదు. ఇంతవరకూ 35 శాతం చిత్రీకరణను పూర్తిచేశాము. లాక్ డౌన్ తరువాత మళ్లీ సెట్స్ పైకి వెళ్లే దిశగా సన్నాహాలు చేసుకుంటున్నాము. కథ మేరకు పక్కా మాస్ టైటిల్ ను సెట్ చేయనున్నాము. జులైలో టైటిల్ ను ఎనౌన్స్ చేస్తాము. సూర్య అభిమానులు ఆశించేస్థాయిలో ఈ సినిమా ఉంటుంది" అని చెప్పుకొచ్చాడు.