IPL 2021: ఐపీఎల్ మిగిలిన మ్యాచ్ లు దుబాయ్ లో... షెడ్యూల్ ఖరారు

BCCI finalized IPL schedule

  • భారత్ లో కరోనా సెకండ్ వేవ్
  • మధ్యలోనే నిలిచిపోయిన ఐపీఎల్ 14వ సీజన్
  • భారత్ లో 29 మ్యాచ్ ల నిర్వహణ
  • దుబాయ్ లో మిగిలిన 31 మ్యాచ్ ల నిర్వహణ
  • సెప్టెంబరు 19 నుంచి టోర్నీ షురూ
  • అక్టోబరు 15న ఫైనల్

కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు ఐపీఎల్ 14వ సీజన్ అర్థాంతరంగా నిలిచిపోవడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఉసూరుమన్నారు. అయితే ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్ లు దుబాయ్ లో నిర్వహించాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) నిర్ణయించింది. తాజాగా దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేసింది.

భారత్ లో ఐపీఎల్ 14వ సీజన్ కు సంబంధించి 29 మ్యాచ్ లు జరగ్గా, మిగిలిన 31 మ్యాచ్ లను దుబాయ్ వేదికగా నిర్వహిస్తారు. సెప్టెంబరు 19న ఐపీఎల్ పోటీలు షురూ అవుతాయి. అక్టోబరు 15న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. కాగా, ఐపీఎల్ లో మిగిలిన మ్యాచ్ లకు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ ఆటగాళ్లు వచ్చేది అనుమానంగా మారింది. తాము రాలేమంటూ ఇప్పటికే పలువురు ఆటగాళ్లు సంకేతాలిచ్చారు. దీనిపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందన్నది చూడాలి.

IPL 2021
Dubai
Matches
BCCI
India
Corona Second Wave
  • Loading...

More Telugu News