Nikhil: మూగజీవాలకు పెళ్లి విందు ఏర్పాటు చేసిన నెల్లూరు కొత్త జంట

Marriage held at a Goshala in Nellore
  • నెల్లూరులో పెళ్లి చేసుకున్న నిఖిల్, రక్ష
  • నిఖిల్, రక్ష ఉత్తరాది రాష్ట్రాలవారు
  • నెల్లూరులో స్థిరపడ్డ కుటుంబీకులు
  • తమ పెళ్లి చిరస్మరణీయంగా ఉండాలని భావించిన వైనం
  • రూ.65 వేలతో గోశాలలో విందు
ఇటీవల కాలంలో దేశంలో కాన్సెప్టు వివాహాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏదో ఒక సదుద్దేశం నెరవేరేలా తమ పెళ్లిళ్లను ప్లాన్ చేసుకునేందుకు యువతీయువకులు ఆసక్తి చూపిస్తున్నారు. నెల్లూరుకు చెందిన ఈ కొత్త జంట కూడా తమ పెళ్లి సందర్భంగా మూగజీవాలకు విందు ఏర్పాటు చేసి అందరి అభినందనలు అందుకుంది.

నిఖిల్, రక్ష ఇటీవల పెళ్లితో ఒక్కటయ్యారు. వీరు తెలుగువారు కాదు. వ్యాపార నిమిత్తం ఉత్తర భారతదేశం నుంచి వచ్చి నెల్లూరులో స్థిరపడ్డారు. అయితే తమ పెళ్లి వినూత్నంగా ఉండాలని కోరుకున్న నిఖిల్, రక్ష తమ కుటుంబ సభ్యులను ఒప్పించి ఓ గోశాలలో విందు కార్యక్రమం ఏర్పాటు చేశారు.

ఈ విందులో ఎండుగడ్డి, పచ్చగడ్డితో పాటు రకరకాల పిండివంటలు, ఫలాలను మూగజీవాలకు అందించి మురిసిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ విందు కోసం నిఖిల్, రక్ష రూ.65 వేలు ఖర్చు చేయడం విశేషం. సాధారణ పెళ్లి విందుకు ఇంతకంటే ఎక్కువ మొత్తమే ఖర్చవుతుంది. కానీ మూగజీవాల కోసం వేల రూపాయలు ఖర్చు చేయడం వారి మంచి మనసును చాటుతోంది.
Nikhil
Raksha
Marriage
Goshala
Feeding

More Telugu News