CPI Narayana: జగన్ పక్క రాష్ట్రాల సీఎంలతో బలాన్ని కూడగట్టే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు?: సీపీఐ నారాయణ
- ఈటల బీజేపీలో చేరితే కేసీఆర్ కు కష్టమే
- తెలంగాణ మరో బెంగాల్ లా మారకుండా జాగ్రత్త పడాలి
- ఝార్ఖండ్ సీఎం ప్రధానికి లేఖ రాసినప్పుడు జగన్ వారించారు
ఈటల రాజేందర్ అంశం తెలంగాణలో రాజకీయ వేడిని పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీకి వెళ్లిన ఈటల బీజేపీ హైకమాండ్ తో భేటీ అయిన సంగతి కూడా విదితమే. ఆయన బీజేపీలో చేరడం ఖాయమైంది. ఈ నేపథ్యంలో బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య కూడా మాటల తూటాలు పేలుతున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈటల టీఆర్ఎస్ ను వీడి, బీజేపీలో చేరితే ముఖ్యమంత్రి కేసీఆర్ కు కష్టమేనని నారాయణ అన్నారు. తెలంగాణ రాష్ట్రం మరో పశ్చిమబెంగాల్ లా మారకుండా కేసీఆర్ జాగ్రత్త పడాలని సూచించారు. ఏపీ సీఎం జగన్ బెయిల్ గురించి మాట్లాడుతూ... జగన్ కు బెయిల్ రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి ప్రధానికి లేఖ రాసినప్పుడు జగన్ వారించారని.. ఇప్పుడెందుకు ఆయన పక్క రాష్ట్రాల సీఎంలతో బలాన్ని కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారని ప్రశ్నించారు.