Uttam Kumar Reddy: కరోనా వ్యాక్సినేషన్ అంశంపై గవర్నర్ కు వినతిపత్రం సమర్పించిన ఉత్తమ్, రేవంత్

Telangana Congress leaders met governor
  • గవర్నర్ ను కలిసిన కాంగ్రెస్ నేతలు
  • రాష్ట్రపతిని ఉద్దేశిస్తూ వ్యాక్సినేషన్ పై వినతులు
  • దేశమంతా ఒకే విధానం అమలు చేయాలని విజ్ఞప్తి
  • వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచన
తెలంగాణ కాంగ్రెస్ అగ్రనేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ ఇవాళ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిసి కరోనా వ్యాక్సినేషన్ అంశంపై వినతిపత్రం అందజేశారు. ఆ వినతిపత్రంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ను ఉద్దేశిస్తూ పలు విజ్ఞప్తులు చేశారు. దేశవ్యాప్తంగా ఏకీకృత, ఉచిత వ్యాక్సినేషన్ విధానాన్ని తప్పనిసరిగా అమలు చేసేలా చూడాలని కోరారు. రోజుకు 1 కోటి డోసులు ఇచ్చేలా వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ, తెలంగాణలో కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో కరోనా, బ్లాక్ ఫంగస్ చికిత్సలు దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి పెనుభారంగా పరిణమించాయని, అందుకే వాటిని ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు.
Uttam Kumar Reddy
Revanth Reddy
Komatireddy Venkat Reddy
Ponnam Prabhakar
Governor
Tamilisai Soundararajan
Corona Vaccination
Telangana
Congress
TRS

More Telugu News