Mukhesh Ambani: జీతం రూపేణా గతేడాది ఒక్క రూపాయి కూడా తీసుకోని ముఖేశ్ అంబానీ
- దేశంలో కరోనా సంక్షోభం
- వ్యాపార రంగంపై పెను ప్రభావం
- వేతనం స్వచ్ఛందంగా వదులుకున్న రిలయన్స్ అధినేత
- ఇతర రిలయన్స్ డైరెక్టర్ల వేతనాలు యథాతథం
రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యాధినేత వేతనం అంటే కళ్లు చెదిరే రీతిలో ఉంటుందని అందరూ భావిస్తారు. అందులో వాస్తవం లేకపోలేదు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ హోదాలో ముఖేశ్ అంబానీ 2019-20 ఆర్థిక సంవత్సరంలో ఏడాదికి రూ.15 కోట్ల వేతనం అందుకున్నారు. గత 12 ఏళ్లుగా ఆయన జీతం అదే. రూ.24 కోట్ల వేతనం అందుకునే అవకాశం ఉన్నప్పటికీ అంబానీ రూ.15 కోట్లకే పరిమితమయ్యారు. అందులోనే ఇతర అలవెన్సులు, కమిషన్ కలిసి ఉంటాయి.
అయితే, ఆయన గత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఒక్క రూపాయి కూడా వేతనంగా తీసుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆయన తన వేతనాన్ని త్యాగం చేయడం వెనుక బలమైన కారణమే ఉంది. కరోనా మహమ్మారి వ్యాపార రంగాన్ని, ఆర్థిక వ్యవస్థలను దారుణంగా దెబ్బతీసిన నేపథ్యంలో తన ఏడాది జీతాన్ని వదులుకుంటున్నట్టు అంబానీ ప్రకటించారు.
ఇక రిలయన్స్ సంస్థలో భారీ వేతనం అందుకున్న ఇతరుల వివరాలు ఇవిగో...
- నిఖిల్- (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్)- రూ.24 కోట్లు
- హితాల్ మేస్వానీ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్)- రూ.24 కోట్లు
- పీఎంఎస్ ప్రసాద్ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్)- రూ.11.99 కోట్లు
- పవన్ కుమార్ కపిల్ (ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్)- రూ.4.24 కోట్లు
- నీతా అంబానీ (ముఖేశ్ అంబానీ అర్ధాంగి-నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్)- రూ.1.65 కోట్లు (కమిషన్)+రూ.8 లక్షల సిట్టింగ్ ఫీజు