kc: గవర్నర్ తమిళిసైతో భేటీ అయిన కేసీఆర్

KCR meets governor Tamilisai

  • తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భేటీ
  • ఈరోజు గవర్నర్ పుట్టినరోజు కూడా
  • గవర్నర్ కు శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆమెను కలిశారు. మరోవైపు ఈరోజు తమిళిసై పుట్టినరోజు కావడం గమనార్హం. ఈ సందర్భంగా ఆమెకు పుష్పగుచ్ఛం అందించి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు విషయాలపై ఇద్దరూ చర్చించారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ఈ సందర్భంగా గవర్నర్ కు సీఎం వివరించారు.

  • Loading...

More Telugu News