SV Prasad: కరోనాతో మాజీ సీఎస్ ఎస్వీ ప్రసాద్ భార్య కూడా కన్నుమూత

Ex CS SV Prasads wife died with corona

  • కరోనా బారిన పడి నిన్న ఎస్వీ ప్రసాద్ మృతి
  • ఒక్క రోజు వ్యవధిలోనే కన్నుమూసిన ఆయన భార్య
  • వారి కుమారుడికి కూడా కరోనా పాజిటివ్

కరోనా మహమ్మారి ఏపీ మాజీ చీఫ్ సెక్రటరీ ఎస్వీ ప్రసాద్ ఇంట తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఎస్వీ ప్రసాద్ దంపతులకు కరోనా సోకడంతో... ఇద్దరూ ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. చికిత్స పొందుతూ ఎస్వీ ప్రసాద్ నిన్న మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అయితే, ఆయన భార్య కూడా ఈరోజు తుదిశ్వాస విడిచారు. ఒకరోజు వ్యవధిలోనే దంపతులిద్దరూ చనిపోయారనే వార్త అందరినీ కలచి వేస్తోంది. వారి కుమారుడికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం గమనార్హం. ప్రస్తుతం వారి కుటుంబం మొత్తం తీవ్ర విషాదంలో మునిగిపోయింది.

SV Prasad
Ex CS
Wife
Dead
Corona Virus
  • Loading...

More Telugu News