Pooja Hegde: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Pooja Hegde distrubutes essentials to the poor

  • మంచి మనసు చాటుకున్న పూజ 
  • మహేశ్ కి విలన్ గా సీనియర్ హీరో
  • ఓటీటీ ద్వారా తాప్సి 'రష్మీ రాకెట్'

*  తనకు కూడా మంచి మనసుందని కథానాయిక పూజ హెగ్డే చాటుకుంది. కరోనా కారణంగా పనులు లేక తల్లడిల్లుతున్న 100 నిరుపేద కుటుంబాలకు ఒక నెలకు సరిపడా నిత్యావసర సరుకులను పూజ పంపిణీ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
*  మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'సర్కారువారి పాట' సినిమాలో ప్రధాన విలన్ పాత్రకు పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. అయితే, తాజాగా ఈ పాత్రకు సీనియర్ నటుడు యాక్షన్ కింగ్ అర్జున్ ను తీసుకున్నట్టు సమాచారం.
*  గతంలో పలు తెలుగు సినిమాలలో నటించిన కథానాయిక తాప్సి ప్రస్తుతం హిందీ సినిమాలలో నటిస్తోంది. ఈ క్రమంలో ఆమె 'రష్మీ రాకెట్' అనే కథానాయిక ప్రధాన చిత్రంలో నటించింది. ఆకర్ష్ ఖురానా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని త్వరలో ఓటీటీ ద్వారా రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Pooja Hegde
Mahesh Babu
Arjun
Tapsi
  • Loading...

More Telugu News