SP Ammireddy: గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి బదిలీ... ఎక్కడా పోస్టింగ్ ఇవ్వని వైనం!

Guntur urban SP Ammireddy gets transfer
  • పోలీసు ప్రధాన కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశం
  • గుంటూరు అర్బన్ ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్
  • ఇటీవల ఎస్పీ అమ్మిరెడిపై రాజ్ నాథ్ కు ఫిర్యాదు చేసిన రఘురామ
  • కుట్ర చేస్తున్నారంటూ ఆధారాలు అందజేత
ఎవరూ ఊహించని విధంగా ఏపీ సర్కారు గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిని బదిలీ చేసింది. ఆయనకు ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రస్తుతానికి మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టు చేయాలని సూచించారు. ఆయన స్థానంలో గుంటూరు అర్బన్ ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్ ను నియమించారు. ఆరిఫ్ హఫీజ్ ప్రస్తుతం గుంటూరు జిల్లా రూరల్ ఎస్ఈబీలో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నారు.

ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవల కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి ఎస్పీ అమ్మిరెడ్డిపై ఫిర్యాదు చేయడం తెలిసిందే. తనపై ఎస్పీ అమ్మిరెడ్డి, సికింద్రాబాద్ సైనిక ఆసుపత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డి, టీటీడీ జేఈఓ ధర్మారెడ్డి కుట్రకు తెరదీశారని రఘురామ ఆరోపించారు. అందుకు తగిన ఆధారాలను కూడా ఆయన రాజ్ నాథ్ కు సమర్పించినట్టు వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో, ఎస్పీ అమ్మిరెడ్డిని గుంటూరు అర్బన్ ఎస్పీ బాధ్యతల నుంచి హఠాత్తుగా తప్పించడం చర్చనీయాంశంగా మారింది.
SP Ammireddy
Guntur Urban
Police
Andhra Pradesh

More Telugu News