Actor Ajith: తమిళ హీరో అజిత్‌ ఇంటికి బాంబు బెదిరింపు

Actor Ajith gets fake bomb call

  • బాంబు పెట్టినట్టు గుర్తు తెలియని దుండగుల బెదిరింపు కాల్
  • ఇంటి మొత్తాన్ని తనిఖీ చేసిన బాంబ్ స్క్వాడ్
  • ఉత్తుత్తి కాల్ అని నిర్ధారణకు వచ్చిన పోలీసులు

సినీ స్టార్ల ఇంటికి బాంబు బెదిరింపులు రావడం ఇటీవలి కాలంలో ఎక్కువయింది. తాజాగా తమిళ అగ్రనటుడు అజిత్ ఇంటికి ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. చెన్నైలోని ఆయన ఇంట్లో బాంబు పెట్టినట్టుగా గుర్తు తెలియని దుండగులు ఫోన్ చేశారు. దీంతో, ఈ కాల్ కు సంబంధించిన సమాచారాన్ని ఆయన కుటుంబసభ్యులు పోలీసులకు అందించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటిన ఆయన ఇంటికి చేరుకున్నారు.

జాగిలాలతో పాటు అజిత్ ఇంటికి వెళ్లిన బాంబ్ స్వాడ్ ఇంటి మొత్తాన్ని తనిఖీ చేశారు. బాంబు కనిపించకపోవడంతో... అది ఉత్తుత్తి కాల్ అని నిర్ధారణకు వచ్చారు. మరోవైపు, ఆ కాల్ నంబర్ ఆధారంగా దుండగులను పట్టుకునే పనిలో పోలీసులు పడ్డారు. అజిత్ చెన్నైలోని తిరువాన్మియూరులో నివాసం ఉంటున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News