South Central Railway: ప్రయాణికులు లేక రైళ్లు వెలవెల... రద్దు చేసిన దక్షిణ మధ్య రైల్వే

South Central Railway cancels trains

  • దేశంలో కరోనా సెకండ్ వేవ్
  • కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
  • ప్రయాణాలు చేసేందుకు ప్రజలు వెనుకంజ
  • జూన్ 1 నుంచి 16వ తేదీ వరకు పలు రైళ్లు రద్దు

దేశంలో కరోనా వ్యాప్తి ఇంకా కొనసాగుతుండడంతో ప్రజలు రైళ్లలో ప్రయాణాలకు వెనుకంజ వేస్తున్నారు. రాష్ట్రాల్లో లాక్ డౌన్లు కొనసాగుతుండడం కూడా ప్రయాణికుల తగ్గుదలకు కారణం. ఈ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో జూన్ 1 నుంచి 16వ తేదీ వరకు పలు రైళ్లను రద్దు చేశారు. ప్రయాణికులు లేక రైళ్లు వెలవెల పోతుండడంతో దక్షిణ మధ్య రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని, ప్రజలకు కలిగే అసౌకర్యం పట్ల చింతిస్తున్నామని పేర్కొంది.

రద్దు చేసిన రైళ్ల వివరాలు...

  • గూడూరు-విజయవాడ
  • విజయవాడ-గూడూరు
  • గుంటూరు-వికారాబాద్
  • వికారాబాద్-గుంటూరు
  • విజయవాడ-సికింద్రాబాద్
  • సికింద్రాబాద్-విజయవాడ
  • బీదర్-హైదరాబాద్
  • సికింద్రాబాద్-బీదర్
  • సిర్పూర్ కాగజ్ నగర్-సికింద్రాబాద్
  • సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్ నగర్
  • నర్సాపూర్-నిడదవోలు
  • నిడదవోలు-నర్సాపూర్
  • కాచిగూడ-గుంటూరు
  • గుంటూరు-కాచిగూడ
  • ఆదిలాబాద్-హెచ్ఎస్ నాందేడ్
  • హెచ్ఎస్ నాందేడ్-ఆదిలాబాద్
  • పర్బని-హెచ్ఎస్ నాందేడ్
  • చెన్నై సెంట్రల్-తిరుపతి
  • తిరుపతి-చెన్నై సెంట్రల్
  • విజయవాడ-చెన్నై సెంట్రల్
  • చెన్నై సెంట్రల్-విజయవాడ

  • Loading...

More Telugu News