Southwest Monsoon: ఈసారి ఆలస్యంగా నైరుతి రుతుపవనాల రాక
- తొలుత జూన్ 1న కేరళను తాకుతాయని అంచనా
- స్తబ్దుగా మారిన రుతుపవనాలు
- జూన్ 3న కేరళను తాకే అవకాశం
- ఈసారి కూడా సమృద్ధిగా వర్షాలు
జూన్ మాసం వస్తుండడంతో అందరి దృష్టి నైరుతి రుతుపవనాల సీజన్ పై పడింది. ఈసారి కూడా అంచనాలకు తగ్గట్టుగానే వర్షాలు పడతాయని వాతావరణ సంస్థలు చెబుతున్నాయి. అయితే, తొలుత పేర్కొన్న విధంగా కాకుండా, నైరుతి రుతువపనాలు ఆలస్యంగా కేరళను తాకనున్నాయి. జూన్ 1 నాటికి కేరళను నైరుతి రుతుపవనాలు తాకుతాయని గత నివేదికల్లో పేర్కొన్నారు. అయితే వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల ఫలితంగా, జూన్ 3న రుతుపవనాలు కేరళను తాకుతాయని నిపుణులు వెల్లడించారు.
కాగా, కేరళకు ప్రస్తుతం ఇవి 100 కిలోమీటర్ల దూరంలో స్తబ్దంగా ఉన్నట్టు భావిస్తున్నారు. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే అండమాన్ సముద్రంలో ప్రవేశించాయి. ఇటీవల సంభవించిన తుపానులతో రుతుపవనాల రాకకు అనుకూల వాతావరణం ఏర్పడింది.