Jagan: ఇంకా మంచి చేయడానికి మీ బిడ్డగా సిద్ధంగా ఉన్నా: రెండేళ్ల పాలనపై సీఎం జగన్

YS Jagan message after completion two years as AP CM

  • ఏపీలో వైసీపీ పాలనకు రెండేళ్లు
  • సోషల్ మీడియాలో సీఎం జగన్ స్పందన
  • హామీలన్నీ నెరవేర్చుతున్నామని వెల్లడి
  • ప్రజలకు భరోసా ఇవ్వగలిగామని వివరణ

ఏపీ సీఎంగా తన రెండేళ్ల పాలనపై వైఎస్ జగన్ సోషల్ మీడియాలో స్పందించారు. దేవుడి దయ, ప్రజల దీవెనలతో ఈ రెండేళ్ల కాలంలో మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి మాటను, ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చుతూ వచ్చామని వెల్లడించారు. ప్రజలకు నేరుగా రూ.95,528 కోట్లు.... ఇతర పథకాల ద్వారా మరో రూ.36,197 కోట్లు... మొత్తంగా రూ.1.31 లక్షల కోట్లు అందించగలిగామని వివరించారు. ఏ కష్టం వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందన్న భరోసా ఇవ్వగలిగామని సీఎం జగన్ తెలిపారు.  

మీ బిడ్డగా, మీ ముఖ్యమంత్రిగా, మీ కుటుంబ సభ్యుడిగా ఇంకా మంచి చేయడానికి మరింత తాపత్రపడతానని వివరించారు. ప్రజలు అందించిన ఈ అధికారంతో అనుక్షణం ప్రజాశ్రేయస్సు, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పరిపాలన అందిస్తానని మరోసారి స్పష్టం చేస్తున్నాను అంటూ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News