Andhra Pradesh: ఏపీకి మరో 1.80 లక్షల కరోనా వ్యాక్సిన్ డోసుల చేరిక

More vaccine doses arrives AP

  • ఏపీలో వ్యాక్సినేషన్ కు ఊతం
  • సీరం నుంచి లక్ష కొవిషీల్డ్ టీకాలు రాక
  • హైదరాబాద్ నుంచి 80 వేల కొవాగ్జిన్ డోసులు చేరిక
  • టీకా డోసులు గన్నవరం స్టోరేజి యూనిట్ కు తరలింపు

ఏపీలో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగవంతం చేసేందుకు ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రానికి మరో 1.80 లక్షల వ్యాక్సిన్ డోసులు రావడం ప్రభుత్వ కార్యాచరణకు మరింత ఊతమివ్వనుంది. ఢిల్లీ నుంచి విజయవాడ చేరుకున్న విమానంలో లక్ష కొవిషీల్డ్ డోసులు విజయవాడకు వచ్చాయి. అటు, హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో 80 వేల కొవాగ్జిన్ డోసులు కూడా వచ్చాయి. కొత్తగా వచ్చిన ఈ లక్షకు పైగా డోసులతో వ్యాక్సిన్ పంపిణీలో పురోగతి కనిపించనుంది. కాగా, రాష్ట్రానికి చేరుకున్న వ్యాక్సిన్ డోసులను గన్నవరంలోని ప్రత్యేక స్టోరేజి యూనిట్ కు తరలించారు.

Andhra Pradesh
Corona Vaccine
Covishield
COVAXIN
Gannavaram
  • Loading...

More Telugu News