Kishan Reddy: బెంగాల్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఫైర్

kishan Reddy fires on Mamata Banerjee

  • ఎన్నికల తర్వాత బెంగాల్ లో హింస
  • హింసపై కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర హోంశాఖ
  • కిషన్ రెడ్డికి నివేదిక అందించిన కమిటీ

పశ్చిమబెంగాల్ లోని మమతా బెనర్జీపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు. మమత నేతృత్వంలోని పాలనలో రాజ్యంగ వ్యతిరేక పాలన నడుస్తోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర పోలీసులు కూడా టీఎంసీ కార్యకర్తల్లా పని చేస్తున్నారని దుయ్యబట్టారు.

బెంగాల్ ప్రజల ప్రాథమిక హక్కులను కాపాడేందుకు ఏం చేయాలనే విషయంపై చర్చించి, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల ఫలితాలు వెలువడి రోజులు గడుస్తున్నా బెంగాల్ లో హింస చల్లారలేదని అన్నారు. ఈ హింసపై మేధావులు, నిపుణుల కమిటీ కేంద్ర హోంశాఖకు నివేదికను సమర్పించిందని చెప్పారు.

అసెంబ్లీ ఎన్నికల తర్వాత బెంగాల్ లో తీవ్ర హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు న్యాయవాది మోనికా అరోరా నేతృతం వహించగా... కమిటీలో మేధావులు, నిపుణులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ బెంగాల్ లో పర్యటించి, క్షేత్ర స్థాయిలో జరిగిన విషయాలను సేకరించి కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డికి నివేదికను అందజేసింది.

Kishan Reddy
BJP
Mamata Banerjee
TMC
West Bengal
  • Loading...

More Telugu News