Balka Suresh: ఎమ్మెల్యే బాల్క సుమన్ కు పితృవియోగం... ఫోన్ లో పరామర్శించిన సీఎం కేసీఆర్

CM KCR consoles MLA Balka Suman

  • బాల్క సుమన్ తండ్రి సురేశ్ కన్నుమూత
  • హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో మృతి
  • పార్టీకి విశేష సేవలందించారన్న సీఎం కేసీఆర్
  • బాల్క సుమన్ కుటుంబ సభ్యులను ఓదార్చిన వైనం

టీఆర్ఎస్ యువ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి బాల్క సురేశ్ కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న సురేశ్ హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ మధ్యాహ్నం కన్నుమూశారు. ఈ విషయం తెలిసిన వెంటనే సీఎం కేసీఆర్ పార్టీ సహచరుడ్ని పరామర్శించారు.

విషాదంలో ఉన్న బాల్క సుమన్ కు ఫోన్ చేసి ఓదార్చారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బాల్క సురేశ్ టీఆర్ఎస్ పార్టీలో క్రియాశీల నాయకుడిగా చురుకైన పాత్ర పోషించారని, మెట్ పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ గా సేవలు అందించారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

Balka Suresh
Balka Suman
KCR
TRS
Telangana
  • Loading...

More Telugu News