Kalyan Ram: 'బింబిసార'... కల్యాణ్ రామ్ నుంచి చారిత్రక చిత్రం... మోషన్ పోస్టర్ ఇదిగో!

Kalyan Ram as Bimbisara

  • నేడు ఎన్టీఆర్ జయంతి
  • కల్యాణ్ రామ్ కొత్త చిత్రం టైటిల్ విడుదల
  • మోషన్ పోస్టర్ లింకును పంచుకున్న చిత్రయూనిట్
  • వశిష్ఠ దర్శకత్వంలో బింబిసార
  • కల్యాణ్ రామ్ సరసన కాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్

విభిన్న కథాంశాలతో చిత్రాలు చేయడానికి ఆసక్తి చూపించే నందమూరి హీరో కల్యాణ్ రామ్ ఈసారి చారిత్రక కథాంశంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆయన తాజాగా 'బింబిసార' అనే హిస్టారికల్ మూవీలో నటిస్తున్నారు. ఇవాళ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ తో పాటు, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. క్రీస్తు పూర్వం 5వ శతాబ్దానికి చెందిన మగధ రాజ్యాధిపతే బింబిసారుడు.

ఈ చిత్రానికి వశిష్ఠ (నిర్మాత మల్లిడి సత్యనారాయణరెడ్డి తనయుడు) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కల్యాణ్ రామ్ బావమరిది హరికృష్ణ నిర్మిస్తున్నాడు. పుణ్యభూమిలో ఓ అటవిక రాజు కథే ఈ సినిమా అంటూ చిత్రబృందం మోషన్ పోస్టర్ లింకును పంచుకుంది. ఇందులో కల్యాణ్ రామ్ సరసన కాథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ నటిస్తున్నారు. ఇతర పాత్రల్లో శ్రీనివాసరెడ్డి, వెన్నెల కిశోర్ కనిపించనున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News