fan: హీరోయిన్‌కు అభిమాని ప్రేమ‌లేఖ‌.. సున్నితంగా బుద్ధి చెప్పిన న‌టి!

fan sends love proposel to heroin

  • వ‌ర్ధ‌మాన న‌టి అనికాకు అప్పుడే భారీ ఫాలోయింగ్
  • అభిమాని పంపిన ప్రేమలేఖపై స్పందించిన హీరోయిన్
  • త‌న కోసం ఇటువంటివి చేయొద్ద‌ని చెప్పిన న‌టి

వ‌ర్ధ‌మాన న‌టి అనికా సినీరంగంలోకి అడుగుపెట్టిన కొద్దికాలంలోనే వీరాభిమానుల‌ను సంపాదించుకుంది. అప్ప‌ట్లో అజిత్‌ నటించిన ‘విశ్వాసం’ సినిమాలో ఆయ‌నకు కుమార్తెగా న‌టించిన అనికాకు మ‌ల‌యాళ సినిమాలో హీరోయిన్‌గా చాన్స్ వ‌చ్చింది. ఆమె హీరోయిన్‌గా ఇంకా వెండితెర‌పై మెర‌వ‌క‌ముందే ఆమె అభిమానులను సంపాదించుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఆమెకు 10 ల‌క్ష‌ల కంటే అధికంగా ఫాలోవ‌ర్లు ఉన్నారు.

తాజాగా ఆమె వీరాభిమాని అయిన ఓ యువ‌కుడు ఆమెకు ప్రేమలేఖ పంపాడు. ఒక‌వేళ తన ప్రేమను అనికా అంగీకరించకుంటే ప్రాణం తీసుకుంటానని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. అత‌డికి స‌దరు హీరోయిన్ రిప్లై ఇస్తూ హితబోధ చేసింది. ప్రాణం విలువ ఏంటో వివ‌రించి చెప్పింది. త‌న కోసం ఇటువంటి ప‌నులు చేయొద్ద‌ని హిత‌వు ప‌లికింది. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది.

fan
Tamilnadu
Viral Videos
  • Error fetching data: Network response was not ok

More Telugu News