Payal: ఒక్కమాటలో పాయల్ తేల్చిపారేసిందే!

Payal said that she is not doing any item song

  • 'ఆర్ ఎక్స్ 100'తో లభించిన హిట్
  • అంతగా కలిసిరాని పెద్ద సినిమాలు
  • అవకాశాల కోసం వెయిటింగ్
  • పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేసిన పాయల్  

పాయల్ రాజ్ పుత్ పేరు వినిపించగానే, 'ఆర్ ఎక్స్ 100' సినిమా గుర్తొస్తుంది. ఆ సినిమాలో ఆమె ఒలకబోసిన ఒయ్యారాలు .. వడ్డించిన అందాలు మనసులో మెదులుతాయి. అలాంటి పాయల్ కి ఆ తరువాత పెద్ద హీరోల సరసన అవకాశాలు వచ్చినప్పటికీ అవి అంతగా కలిసి రాలేదు. 'సీత' సినిమాలో ఆమె చేసిన 'బుల్లెట్టు మీదొచ్చే' ఐటమ్ పాటకు అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. దాంతో ఇక ఐటమ్ పాటల్లోను ఆమె ఒక రేంజ్ లో మెరిసే అవకాశాలు ఉన్నాయని చెప్పుకున్నారు.

ఈ నేపథ్యంలోనే 'బంగార్రాజు' సినిమాలోనూ ఆమె ఒక ఐటమ్ చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. కల్యాణ్ కృష్ణ దర్శకుడిగా నాగార్జున హీరోగా ఈ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కనుంది. ఈ సినిమాలోని ఒక ఐటమ్ సాంగ్ కోసం పాయల్ ను సంప్రదిస్తున్నట్టుగా ప్రచారం జరిగింది. అందుకు పాయల్ స్పందిస్తూ .. "నేను ఏ స్పెషల్ సాంగ్ లో కనిపించడం లేదు' అంటూ స్పష్టం చేసింది. అలా జోరుగా జరుగుతున్న ఈ ప్రచారానికి పాయల్ సింపుల్ గా ఫుల్ స్టాప్ పెట్టేసిందన్న మాట.

  • Error fetching data: Network response was not ok

More Telugu News