Indian Railways: యాస్ తుపాను ఎఫెక్ట్.. మరికొన్ని రైళ్లను రద్దు చేసిన రైల్వే
- తూర్పు మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం
- తుపాను హెచ్చరికలతో పదుల సంఖ్యలో రైళ్ల నిలిపివేత
- నేటి నుంచి 30వ తేదీ మధ్య ఒక్కో రైలు ఒక్కో రోజు రద్దు
తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం నేడు తుపానుగా, రేపు పెను తుపానుగా మారే అవకాశం ఉండడంతో రైల్వే శాఖ అప్రమత్తమైంది. శనివారం 59 రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ నిన్న మరిన్ని రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. నేటి నుంచి 30వ తేదీ మధ్య రైళ్లను నిలిపివేస్తున్నట్టు తెలిపింది.
వీటిలో నిజాముద్దీన్, హౌరా, సంత్రగచ్చి, తిరువనంతపురం, చెన్నై సెంట్రల్, వాస్కోడిగామా, పాట్నా, పురులియా, కన్యాకుమారి, తాంబ్రం, యశ్వంత్‌పూర్ నుంచి బయలుదేరే రైళ్లు ఉన్నాయి. తుపాను హెచ్చరికల నేపథ్యంలో ఒక్కో రైలును ఒక్కో రోజు నిలిపివేస్తున్నట్టు రైల్వే తెలిపింది.