Bail Copy: రఘురామ బెయిల్ తీర్పు కాపీని ఆర్మీ ఆసుపత్రికి అందజేసిన న్యాయవాదులు

Advocates handed over bail copy to army hospital
  • రఘురామపై ఏపీ సీఐడీ రాజద్రోహం కేసు నమోదు
  • బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు
  • తీర్పు కాపీ విడుదల
  • రఘురామ సోమవారం విడుదలయ్యే అవకాశం
నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజుపై ఏపీ సీఐడీ నమోదు చేసిన రాజద్రోహం కేసులో సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. రఘురామకు బెయిల్ ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ విడుదల అయింది. ఈ కాపీని రఘురామ తరఫు న్యాయవాదులు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రి వర్గాలకు అందజేశారు. రఘురామ ప్రస్తుతం ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ క్రమంలో ఆయన ఆసుపత్రి నుంచి సోమవారం డిశ్చార్జి అవుతారని తెలుస్తోంది.

బెయిల్ తీర్పు కాపీలో సుప్రీం పలు అంశాలను పేర్కొంది. తన బెయిల్ కోసం రఘురామ 10 రోజుల్లో సీఐడీ కోర్టులో రూ.1 లక్ష పూచీకత్తు చెల్లించి బెయిల్ పొందవచ్చని వివరించింది. అందుకోసం ఇద్దరు హామీదార్ల పేర్లను కూడా చేర్చాల్సి ఉంటుంది. ఈ పత్రాలను సోమవారం ఆయన న్యాయవాదులు సీఐడీ కోర్టులో సమర్పించిన మీదట, సైనికాసుపత్రి నుంచి రఘురామ విడుదల కానున్నారు.
Bail Copy
Raghu Rama Krishna Raju
Army Hospital
Supreme Court

More Telugu News