రామ్ కోసం అనుకున్న కథలో మెగా హీరో!
- ప్రవీణ్ సత్తారుకి వరుణ్ తేజ్ గ్రీన్ సిగ్నల్
- లింగుస్వామి దర్శకత్వంలో రామ్
- గతంలో ఈ కథను బన్నీకి వినిపించిన లింగుస్వామి
ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు .. నాగార్జున కథానాయకుడిగా ఒక సినిమా చేస్తున్నాడు. ఆ తరువాత ఆయన వరుణ్ తేజ్ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడని అంటున్నారు. అయితే గతంలో ఆయన రామ్ తో చేద్దామనుకున్న యాక్షన్ కథనే వరుణ్ తో చేయనున్నాడనే టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం రామ్ .. లింగుస్వామి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. లింగుస్వామి దర్శకత్వంలో రామ్ చేస్తున్న సినిమా కూడా, గతంలో ఆయన బన్నీకి వినిపించినదేనని అంటున్నారు. హీరోలు బిజీగా ఉండటం వలన కథలు ఒకరి నుంచి ఒకరికి వెళుతుండటం మామూలే!