Pawan Kalyan: 'హరి హర వీరమల్లు' గ్రాఫిక్స్ కోసం భారీ ఖర్చు!

Huge budjet for graphics in Haari Hara Veeramallu
  • క్రిష్ నుంచి మరో చారిత్రక చిత్రం
  • మొగల్ సెట్ల కోసం భారీ ఖర్చు
  • గ్రాఫిక్స్ కోసం 50 కోట్ల కేటాయింపు?  
చారిత్రక చిత్రాలను తెరకెక్కించడంలో తనదైన మార్కు చూపించిన క్రిష్, పవన్ కల్యాణ్ కథానాయకుడిగా 'హరిహర వీరమల్లు' సినిమాను రూపొందిస్తున్నాడు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో, జాక్విలిన్ మొగల్ రాణి పాత్రను పోషిస్తోంది. ఈ సినిమాకి ఎ.ఎం. రత్నం నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కోట్ల రూపాయల ఖర్చుతో మొగల్ కట్టడాల సెట్లు వేస్తున్నారు. ఈ సినిమాలో సగం ఖర్చు సెట్ల కోసమే చేస్తున్నారట.

కథా పరంగా గ్రాఫిక్స్ కి పెద్దమొత్తంలో ఖర్చు చేస్తున్నారట. కేవలం గ్రాఫిక్స్ కోసమే 50 కోట్ల రూపాయలను కేటాయించారట. హాలీవుడ్ టెక్నీషియన్స్ ను నియమించడమే ఇంతటి ఖర్చుకు కారణమని చెబుతున్నారు. విజువల్ వండర్ గా ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నారట. పవన్ కల్యాణ్ కెరియర్లో ఇది మొదటి చారిత్రక చిత్రం కావడంతో, అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే కొంతవరకూ షూటింగు జరుపుకున్న ఈ సినిమా, కరోనా ప్రభావం తరువాత మళ్లీ సెట్స్ పైకి వెళ్లనుంది.
Pawan Kalyan
Nidhi Agarwal
Jaqueline

More Telugu News