Vijay Sai Reddy: పచ్చ నేతలే స్పీకర్, మంత్రులట.. ఈ డ్రామాలో లోకేశంకి ఏ మంత్రి పదవిచ్చాడో బాబు?: విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా

vijay sai reddy slams tdp

  • టీడీపీ నేత‌ల మాక్ అసెంబ్లీపై విమ‌ర్శ‌లు
  • అందుకే మీది తెలుగు డ్రామా పార్టీ అన్నది
  • అసెంబ్లీకి డుమ్మాకొట్టి తెలంగాణ నుంచి జూమ్ లో అసెంబ్లీ పెట్టేశాడు
  • ఇంకా ఢిల్లీలో చక్రం తిప్పేస్తున్నానన్న భ్రమల్లోనే ఉన్నాడు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాల‌ను బ‌హిష్క‌రించిన టీడీపీ నేత‌లు మాక్ అసెంబ్లీ నిర్వ‌హించుకుంటోన్న విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ విజ‌యసాయిరెడ్డి చుర‌క‌లంటించారు. ఈ మాక్ అసెంబ్లీలో టీడీపీ నేత‌ లోకేశ్‌కి ఆ పార్టీ అధినేత‌ చంద్ర‌బాబు నాయుడు ఏ మంత్రి ప‌ద‌వి ఇచ్చాడో అంటూ ఎద్దేవా చేశారు.

'ఏమి నాటకాలయ్యా చంద్రం! అందుకే మీది తెలుగు డ్రామా పార్టీ అన్నది. అసెంబ్లీకి డుమ్మాకొట్టి తెలంగాణ నుంచి జూమ్ లో అసెంబ్లీ పెట్టేశాడు. పచ్చ నేతలే స్పీకర్ - మంత్రులట! ఇంకా ఢిల్లీలో చక్రం తిప్పేస్తున్నానన్న భ్రమల్లోనే ఉన్నాడు. ఇంతకీ పుత్రరత్నం లోకేశంకి ఏం మంత్రి పదవిచ్చాడో బాబు?' అని విజ‌య‌సాయిరెడ్డి ఎద్దేవా చేశారు. తెలుగు డ్రామా పార్టీ జ‌బ‌ర్ద‌స్త్ షో అంటూ ఓ ఫొటోను ఆయ‌న పోస్ట్ చేశారు.

కాగా, అసెంబ్లీలో ప్ర‌భుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి మాట నిల‌బెట్టుకుంద‌ని విజ‌యసాయిరెడ్డి అన్నారు. 'హామీ ఇస్తే నిలబెట్టుకోవడం జగన్ గారి సహజ గుణం - సహజ శైలి. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేస్తామని ఫిబ్రవరిలోనే మాటిచ్చారు...అసెంబ్లీలో తీర్మానం చేసి మాట నిలబెట్టుకున్నారు. ఏపీ గుండె చప్పుడును ఢిల్లీలో వినిపించడానికి ఏమాత్రం వెనుకాడని ప్రభుత్వమిది' అని విజ‌యసాయిరెడ్డి అన్నారు.

Vijay Sai Reddy
YSRCP
Telugudesam
  • Error fetching data: Network response was not ok

More Telugu News