Puri Jagannadh: యష్ ను లైన్లో పెట్టిన పూరి?

Puri Jagannadh next movie with Yash

  • పూరి నుంచి రానున్న 'లైగర్'
  • నెక్స్ట్ మూవీ పొలిటికల్ థ్రిల్లర్
  • హీరోగా కన్నడ స్టార్ యష్    

పూరి జగన్నాథ్ .. ఇటు యూత్ లోను .. అటు మాస్ లోను ఈ పేరుకున్న క్రేజ్ అంత ఇంతా కాదు. తమ మాస్ ఇమేజ్ పెరగడం కోసం చాలామంది హీరోలు ఆయన దర్శకత్వంలో చేయడానికి ఉత్సాహాన్ని చూపుతుంటారు. ఆ మధ్య 'పోకిరి' మహేశ్ బాబు క్రేజ్ ను ఎంతగా పెంచిందో, ఈ మధ్య వచ్చిన 'ఇస్మార్ట్ శంకర్' రామ్ కి అంతటి క్రేజ్ తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే విజయ్ దేవరకొండ హీరోగా పూరి 'లైగర్' సినిమాను రూపొందించాడు. దాంతో ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది.

ఈ క్రమంలో, తాజాగా ఓ వార్త ఫిల్మ్ నగర్లో హల్ చల్ చేస్తోంది. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన యష్ ను రంగంలోకి దింపడానికి పూరి ప్రయత్నిస్తున్నాడనేది ఆ వార్త సారాంశం. 'కేజీఎఫ్' హిట్ తరువాతనే పూరి వెళ్లి యష్ కి ఒక కథను వినిపించాడట. అయితే అప్పటికే 'కేజీఎఫ్ 2'ను ఒప్పుకున్నట్టుగా చెప్పాడట.

దాంతో పూరి ఇటీవల మరో కథతో వెళ్లి యష్ ను కలుసుకున్నాడని అంటున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఒక కథను పూరి వినిపించడంతో, యష్ ఓకే అనేశాడని చెప్పుకుంటున్నారు. 'లైగర్' రిలీజ్ తరువాత ఈ ప్రాజెక్టు ఉంటుందని టాక్.  

Puri Jagannadh
Vijay Devarakonda
Yash
  • Loading...

More Telugu News