Abhiram: యాక్షన్ మూవీతోనే రానున్న రానా బ్రదర్!

Daggubati Abhiram in action movie

  • సురేశ్ బాబు నుంచి గ్రీన్ సిగ్నల్
  • హీరోగా అభిరామ్ ఎంట్రీ
  • దర్శకుడిగా తేజ.. త్వరలో సెట్స్ పైకి

దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి హీరోగా వచ్చిన వెంకటేశ్ ఇప్పటికీ ఒక రేంజ్ లో దూసుకుపోతున్నారు. ఆ తరువాత ఎంట్రీ ఇచ్చిన రానా తనదైన ప్రత్యేకతను చాటుకుంటున్నాడు. విభిన్నమైన కథలకు .. విలక్షణమైన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నాడు.

ఈ నేపథ్యంలోనే రానా సోదరుడు అభిరామ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నాడు. క్రితం ఏడాదిలోనే అభిరామ్ సినిమా ఉంటుందని అనుకున్నారు. కానీ కరోనా అలజడి కారణంగా అప్పటికి వాయిదా వేసుకున్నారు. కానీ ఇక ఇప్పుడు మొదలుపెట్టవలసిందే అనే నిర్ణయానికి వచ్చారు.

అభిరామ్ ను హీరోగా పరిచయం చేసే బాధ్యతను సురేశ్ బాబు .. తేజకు అప్పగించారు. అదే సమయంలో తేజ 'చిత్రం 1.1' టైటిల్ ను ప్రకటించారు. దాంతో ఈ సినిమాలోనే అభిరామ్ చేస్తున్నాడని అనుకున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్ ద్వారానే అయన పరిచయం కానున్నాడని భావించారు. కానీ అభిరామ్ చేసే సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఈ కథ వైపే సురేశ్ బాబు మొగ్గుచూపడంతో, దానినే ఖాయం చేశారట. త్వరలోనే ఈ ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Abhiram
Suresh Babu
Teja
  • Loading...

More Telugu News