YV Subba Reddy: వైవీ సుబ్బారెడ్డిపై నమోదైన ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసును ఎత్తేసిన ప్రభుత్వం

govt removes case against yv subbareddy

  • 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రవర్తన నియమావళి ఉల్లంఘన కేసు నమోదు
  • నిషేధాజ్ఞలు ఉల్లంఘించి గుమికూడడం, వాహన రాకపోకలకు ఆటంకం కలిగించడం వంటి అభియోగాలు
  • డీజీపీ నుంచి అందిన ప్రతిపాదన మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

టీటీడీ చైర్మన్, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డిపై ప్రకాశం జిల్లా పొదిలి పోలీస్ స్టేషన్‌లో నమోదైన కేసును ప్రభుత్వం ఎత్తివేసింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో సుబ్బారెడ్డి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ కేసు నమోదైంది. అప్పటి ఎన్నికల కోడ్ మండల పర్యవేక్షణాధికారి కె.హీరాలాల్ ఫిర్యాదుపై సుబ్బారెడ్డి సహా పలువురిపై కేసు నమోదైంది.

ప్రభుత్వ నిషేధాజ్ఞలు ఉల్లంఘించి గుమికూడడం, రహదారిపై రాకపోకలకు ఆటంకం కలిగించారన్న అభియోగాలపై ఈ కేసు నమోదైంది. తాజాగా, డీజీపీ నుంచి అందిన ప్రతిపాదనతో హోంశాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ ఈ కేసును ఎత్తివేయాలని నిన్న ఉత్తర్వులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News