Srikanth Addala: శ్రీకాంత్ అడ్డాల చేతికే 'కర్ణన్' రీమేక్?

Srikanth Addala is going to remake Karnan movie
  • 'కొత్త బంగారులోకం'తో మంచి క్రేజ్ 
  • నిరాశ పరిచిన 'బ్రహ్మోత్సవం'
  • చాలా గ్యాప్ తరువాత చేసిన 'నారప్ప'
  • బెల్లంకొండతో తదుపరి సినిమా?
'కొత్త బంగారులోకం' సినిమాతో మొదటి ప్రయత్నంలోనే శ్రీకాంత్ అడ్డాల భారీ విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత చేసిన రెండు సినిమాలు ఫరవాలేదు అనిపించాయి. ఇక మహేశ్ బాబుతో చేసిన 'బ్రహ్మోత్సవం' మాత్రం భారీ అంచనాల మధ్య విడుదలైంది. కానీ ఆ అంచనాలను అందుకోలేకపోయింది. భారీ తారాగణం ఉంది కానీ .. సరైన కథే లేదు అనే విమర్శలు వినిపించాయి. ఏదేమైనా ఆ సినిమా పరాజయం శ్రీకాంత్ అడ్డాల కెరియర్ పై పెద్ద ప్రభావమే చూపింది. దాంతో ఆయనకి చాలా గ్యాప్ వచ్చేసింది.

తాజాగా ఆయన వెంకటేశ్ హీరోగా 'నారప్ప' సినిమాను రూపొందించాడు. తమిళంలో ధనుశ్ చేసిన 'అసురన్' సినిమాకి ఇది రీమేక్. ఇటీవలే శ్రీకాంత్ అడ్డాల ఈ సినిమా షూటింగును పూర్తిచేశాడు. ఈ సినిమా తరువాత కూడా ఆయన మరో రీమేక్ చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి .. ఆ సినిమా పేరే 'కర్ణన్'. ఇది కూడా తమిళంలో ధనుశ్ చేసిన సినిమానే. ఈ సినిమా రీమేక్ హక్కులను బెల్లంకొండ శ్రీనివాస్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను ఆయన శ్రీకాంత్ అడ్డాలకి అప్పగించాలనుకుంటున్నాడట. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ రానుంది.
Srikanth Addala
Asuran Movie
Karnan Movie

More Telugu News