Revanth Reddy: గతంలో కేసీఆర్ ఉస్మానియా పర్యటనకు వెళ్లి అరచేతిలో వైకుంఠం చూపించారు: రేవంత్ రెడ్డి
- నేడు గాంధీ ఆసుపత్రిలో కేసీఆర్ పర్యటన
- గతంలో ఇచ్చిన హామీలు ఇప్పటిదాకా తీరలేదన్న రేవంత్
- సీఎం కేసీఆర్ ముందు పలు డిమాండ్లు
- జూడాల సమస్యలు పరిష్కరించాలని వెల్లడి
- కొవిడ్ మృతుల కుటుంబాలను ఆదుకోవాలని స్పష్టీకరణ
సీఎం కేసీఆర్ గాంధీ ఆసుపత్రి పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి స్పందించారు. గతంలో సీఎం కేసీఆర్ ఉస్మానియా ఆసుపత్రిలో పర్యటించి అరచేతిలో వైకుంఠం చూపించారని విమర్శించారు. నాటి హామీలు ఇప్పటివరకు నెరవేరలేదని, ఇవాళ్టి గాంధీ పర్యటన కూడా అలాంటిదేనా? అని సందేహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి పలు డిమాండ్లను కేసీఆర్ ముందుంచారు.
జూడాల సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. కొవిడ్ తో చనిపోయిన రోగుల కుటుంబాలను ఆదుకోవాలన్నారు. కరోనా విధుల్లో ఉన్న 4వ తరగతి ఉద్యోగుల జీతాలు రూ.8 వేల నుంచి రూ.16 వేలకు పెంచాలని తెలిపారు. వైద్యులు, ఇతర సిబ్బందికి ఇస్తామన్న 10 శాతం ఇన్సెంటివ్ పైనా చర్యలు తీసుకోవాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.