Nara Lokesh: ఖాకీ డ్రెస్ తీసేసి బులుగు కండువా కప్పుకోండి: ఎస్పీ అమ్మిరెడ్డిపై లోకేశ్ ఆగ్రహం

Nara Lokesh fires in Guntur urban SP Ammireddy

  • ఇద్దరు సీబీఎన్ ఆర్మీ కార్యకర్తల అరెస్ట్
  • విజయసాయిపై పోస్టులు పెట్టారని ఆరోపణలు
  • వాళ్లేమన్నా ఉగ్రవాదులా అంటూ లోకేశ్ ఫైర్
  • ఎస్పీ అమ్మిరెడ్డి ఓవరాక్షన్ చేస్తున్నాడని విమర్శలు
  • తాడేపల్లి కొంపకు చాకిరీ చేస్తున్నారని వ్యాఖ్యలు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై సోషల్ మీడియాలో అభ్యంతరకర వీడియోలు పోస్టు చేశారంటూ ఇద్దరు సీబీఎన్ ఆర్మీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడంపై నారా లోకేశ్ స్పందించారు. గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

'సోషల్ మీడియాలో వీడియోలు పెట్టిన వాళ్లను అంతర్జాతీయ ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేసినట్టు ఏంటా ఓవరాక్షన్!' అంటూ మండిపడ్డారు. ఇలాంటి వీడియోలే టీడీపీ వాళ్లపై కూడా పెట్టారని తాము గతంలో ఫిర్యాదు చేస్తే ఎన్ని కేసుల్లో అరెస్టులు చేశారు? అని లోకేశ్ నిలదీశారు. మంత్రి సీదిరి అప్పలరాజుపై కేసు పెట్టడానికి వచ్చినవారిపైనే రివర్స్ కేసు పెట్టారు అని ఆరోపించారు.

"అమ్మిరెడ్డి గారూ, ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ తాడేపల్లి కొంపకు చాకిరీ చేయడానికి సిగ్గులేదా? జగన్ వద్ద పనిచేయాలని అంత ఉత్సాహం, కులపిచ్చి ఉంటే... పవిత్ర ఖాకీ డ్రెస్ తీసేసి బులుగు కండువా కప్పుకోండి" అని లోకేశ్ వ్యాఖ్యానించారు.

Nara Lokesh
Ammireddy
Jagan
YSRCP
CBN Army
Vijayasai Reddy
Social Media
  • Loading...

More Telugu News