Living Relationship: సహజీవనం చేయడం అన్నది అంగీకారయోగ్యం కాదు: పంజాబ్, హర్యానా హైకోర్టు

Living relationship is not acceptable says Punjab and Haryana HC

  • సహజీవనం సామాజికంగా, నైతికంగా అంగీకారయోగ్యం కాదు
  • సహజీవనం చేయడానికి కోర్టు అంగీకారం కోరడం సరికాదు
  • అలాంటి వారికి మేము రక్షణ కల్పించలేము

యువతీ, యువకులు సహజీవనం చేయడం సామాజికంగా, నైతికంగా అంగీకారయోగ్యం కాదని పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పును వెలువరించింది. సహజీవనం చేయడానికి కోర్టు అంగీకారాన్ని కోరడం సరికాదని,  సహజీవనం చేస్తున్న వారికి తాము రక్షణ కల్పించలేమని పేర్కొంది.

కేసు వివరాల్లోకి వెళ్తే, ఓ యువజంట పెద్దల నుంచి దూరంగా పారిపోయి సహజీవనం చేస్తోంది. తామిద్దరం కలసి ఉంటున్నామని, త్వరలోనే పెళ్లి చేసుకుంటామని హైకోర్టులో వీరిద్దరూ పిటిషన్ వేశారు. అమ్మాయి కుటుంబం నుంచి తమకు ప్రాణహాని ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు సహజీవనం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేస్తూ, వారు వేసిన పిటిషన్ ను కొట్టేసింది.

మరోవైపు సహజీవనాలకు అనుకూలంగా గతంలో సుప్రీంకోర్టు తీర్పులు వెలువరించింది. మేజర్లుగా ఉన్న యువతీయువకులు పెళ్లి చేసుకోకపోయినా, పరస్పర అంగీకారంతో సహజీవనం చేసే హక్కు ఉంటుందని సుప్రీం స్పష్టం చేసింది. సహజీవనం మన దేశంలో ఆమోదయోగ్యం కాకపోయినా, పాపం మాత్రం కాదని చెప్పింది. మేజర్ యువతి తనకు నచ్చిన తోడును ఎంచుకోవచ్చని తెలిపింది.

  • Loading...

More Telugu News