Vikram: తమిళనాడు సీఎం సహాయ నిధికి సినీ రంగం నుంచి విరాళాలు... రూ.30 లక్షలు ఇచ్చిన హీరో విక్రమ్

Actor Vikram donates to CM Relief Fund
  • తమిళనాడులో కరోనా విజృంభణ
  • విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసిన సీఎం స్టాలిన్
  • స్టాలిన్ అభ్యర్థనకు విశేష స్పందన
  • రూ.50 లక్షలు ఇచ్చిన రజనీకాంత్
  • ఆన్ లైన్ ద్వారా విరాళం బదిలీ చేసిన విక్రమ్
కొవిడ్ తో అల్లాడిపోతున్న తమిళనాడు పరిస్థితి పట్ల కోలీవుడ్ చిత్ర పరిశ్రమ స్వచ్ఛందంగా స్పందిస్తోంది. కొవిడ్ కట్టడి కోసం సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు అందుతున్నాయి. ఇప్పటికే తలైవా రజనీకాంత్ స్వయంగా సీఎం స్టాలిన్ కార్యాలయానికి వెళ్లి రూ.50 లక్షల చెక్కు అందజేశారు. కరోనా సహాయకచర్యలకు  ఉపయోగించాలని కోరారు. తాజాగా, ప్రముఖ నటుడు విక్రమ్ కూడా తనవంతు విరాళం ప్రకటించారు. ఆన్ లైన్ ద్వారా 30 లక్షల రూపాయలను తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధికి బదిలీ చేశారు.

అంతకుముందు, రజనీకాంత్ అల్లుడు విశాఖన్ వనంగ్ ముడి రూ.1 కోటి విరాళం అందించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కరోనా బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో విరివిగా విరాళాలు ఇవ్వాలని సీఎం స్టాలిన్ ఇటీవలే బహిరంగ ప్రకటన చేశారు. ఆయన ప్రకటనకు మంచి స్పందనే వస్తోంది.
Vikram
Donation
Stalin
Tamilnadu
Corona Pandemic

More Telugu News