Vijay Sai Reddy: అందుకే రఘురామ, ఆయన కుటుంబ సభ్యులతో ఇలా చెప్పిస్తున్నారు: విజ‌య‌సాయిరెడ్డి

vijay sai reddy slams tdp

  • జగన్ గారిని అప్రతిష్ఠ‌ పాలు చేయడానికి కుట్ర‌
  • ఎల్లోమీడియా, బాబు మనుషులు తాము ఏడవాలనుకున్నవన్నీ చెప్పిస్తున్నారు
  • వాడుకోవడం, వెన్నుపోటు పొడవడం ఈ గ్యాంగుకు  తెలిసిన విద్య
  • కడప పేరు చెప్పించి అక్కడి ప్రజలను అవమానించాలని కుట్రలు  

ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజును అరెస్టు చేసిన నేప‌థ్యంలో ఈ విష‌యంపై స్పందిస్తూ టీడీపీ నేత‌ల‌పై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. 'జగన్ గారిని అప్రతిష్ఠ‌ పాలు చేయడానికి ఎల్లోమీడియా, బాబు మనుషులు తాము ఏడవాలనుకున్నవన్నీ రఘురామ, ఆయన కుటుంబ సభ్యులతో చెప్పిస్తున్నారు. వాడుకోవడం, వెన్నుపోటు పొడవడం ఈ గ్యాంగుకు బాగా తెలిసిన విద్య. కడప పేరు చెప్పించి అక్కడి ప్రజలను అవమానించాలని కుట్రలు పన్నుతున్నారు'  అని విజ‌యసాయిరెడ్డి ఆరోప‌ణ‌లు గుప్పించారు.

'దిగజారుడు అనేది జారుడు బండ లాంటిది. పతనం వైపు, వెనక్కి రాలేనంతగా నెడుతూనే ఉంటుంది. ఎందుకిలా జరిగింది అని ఆలోచించుకునేటప్పటికి టైం మించి పోతుంది.. ఎవరో రెచ్చగొడితే, ఈల వేస్తే, అన్నీ వదిలేసి బట్టలు చించుకుంటే ఇలాగే అవుతుంది. స్వయంకృతానికి బాధ్యులుండరు' అని విజ‌యసాయిరెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు.

Vijay Sai Reddy
YSRCP
Telugudesam
  • Loading...

More Telugu News