Hyderabad: కుటుంబ సభ్యులు గాఢ నిద్రలో ఉండగా అగ్నిప్రమాదం.. ఒకరి సజీవ దహనం

One dead in fire accident in Hyderabad
  • హైదరాబాద్‌లోని హైదర్‌గూడలో ఘటన
  • షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏసీలో చెలరేగిన మంటలు
  • తీవ్రంగా గాయపడిన నలుగురిని రక్షించిన అగ్నిమాపక సిబ్బంది
హైదరాబాద్‌లోని ఓ ఇంట్లో గత రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు సజీవ దహనమయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. హైదర్‌గూడ అవంతినగర్‌లో జరిగిందీ ఘటన. ఇంట్లోని ఏసీలో షార్ట్‌ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కుటుంబ సభ్యులందరూ గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మంటలను గమనించిన స్థానికులు వెంటనే అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు.  క్షణాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది మంటలను అదుపుచేసి ఇంట్లోని వారిని రక్షించారు. అయితే, అప్పటికే గౌరీనాథ్ (38) అనే వ్యక్తి మంటల్లో సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో కుటుంబ సభ్యుల్లో నలుగురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad
Hyderguda
Fire Accident

More Telugu News