mla: క‌రోనా బాధితుల్లో ఉత్సాహం నింపేందుకు ఎమ్మెల్యే డ్యాన్స్.. వీడియో ఇదిగో

Malavalli MLA Dr K Annadani motivational dance

  • క‌ర్ణాట‌క‌లో ఘ‌ట‌న‌
  • సాంస్కృతిక ప్రదర్శనలో పాల్గొన్న ఎమ్మెల్యే అన్న‌దాని
  • రోగులు ఉత్సాహంగా ఉండాల‌ని పిలుపు

కుటుంబ స‌భ్యుల‌కు దూరంగా క్వారంటైన్‌లో ఉంటూ  చికిత్స తీసుకుంటూ ఒత్తిడి ఎదుర్కొంటోన్న క‌రోనా బాధితుల్లో ఉత్సాహం నింపేందుకు కర్ణాటక ఎమ్మెల్యే కె.అన్నదాని డ్యాన్స్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతోంది.

మండ్య పట్టణంలోని రవాణా సంస్థ శిక్షణ కేంద్రం క్వారంటైన్‌ కేంద్రంలో కొంద‌రు చికిత్స తీసుకుంటున్నారు. క‌రోనా రోగుల్లో ఉత్సాహం నింపేందుకు సాంస్కృతిక ప్రదర్శన నిర్వహించగా ఇందులో కె.అన్న‌దాని పాల్గొన్నారు. ఆయ‌న‌ స్వతహాగా జానపద గాయకుడు కావ‌డంతో అక్కడ ప‌లు పాట‌ల‌కు డ్యాన్స్ చేయ‌డం అంద‌రినీ అల‌రించింది.

క‌రోనా బాధితులు ఉల్లాసంగా గ‌డ‌పాల‌ని ఆయ‌న సందేశాన్ని ఇచ్చారు. కాగా, క‌ర్ణాట‌క‌లో ప్ర‌తిరోజు భారీ సంఖ్య‌లో కేసులు న‌మోద‌వుతున్నాయి. ముఖ్యంగా బెంగ‌ళూరులో ఊహించ‌ని స్థాయిలో కేసులు పెరిగిపోతున్నాయి.

  

  • Error fetching data: Network response was not ok

More Telugu News