Randeep Guleria: విచ్చలవిడిగా స్టెరాయిడ్స్ వాడడమే బ్లాక్ ఫంగస్ కు కారణం: ఎయిమ్స్ డైరెక్టర్ గులేరియా

AIIMS Director Dr Randeep Guleria said misuse of steroids causes to Black Fungus infection

  • భారత్ లో బ్లాక్ ఫంగస్ కేసులు
  • కంటిచూపుతో పాటు కొన్నిసార్లు ప్రాణాలు పోతున్న వైనం
  • వివరణ ఇచ్చిన డాక్టర్ గులేరియా
  • స్టెరాయిడ్ల దుర్వినియోగం నిలిపివేయాలని స్పష్టీకరణ

సెకండ్ వేవ్ లో కరోనా బారినపడుతున్న వారిలో కొందరు కంటిచూపు కోల్పోతున్న ఉదంతాలు వెల్లడయ్యాయి. అందుకు కారణం బ్లాక్ ఫంగస్ అని గుర్తించారు. ఈ బ్లాక్ ఫంగస్ తో కొన్ని సందర్భాల్లో మరణాలు కూడా సంభవిస్తున్నాయి. మ్యూకోర్ మైకాసిస్ అని పిలిచే ఈ బ్లాక్ ఫంగస్ పై ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా స్పందించారు. ఇది ముఖ భాగాలకు ప్రధానంగా సోకుతుందని, ముక్కు, కంటి వలయం, మెదడు వంటి భాగాలను ఇన్ఫెక్షన్ కు గురిచేస్తుందని వివరించారు. కొన్ని సందర్భాల్లో ఊపిరితిత్తులకు కూడా వ్యాపిస్తుందని వెల్లడించారు.

కరోనా రోగుల్లో బ్లాక్ ఫంగస్ తీవ్రం కావడానికి ప్రధాన కారణం విచ్చలవిడిగా స్టెరాయిడ్లు వాడడమేనని అభిప్రాయపడ్డారు. అవసరంలేకున్నా స్టెరాయిడ్లు వినిగియోస్తుండడం బ్లాక్ ఫంగస్ ఉద్ధృతికి దోహదపడుతోందని వివరించారు. మధుమేహంతో బాధపడుతున్నవారిలో, కరోనా పాజిటివ్ వ్యక్తుల్లో ఈ ఫంగస్ తీవ్ర లక్షణాలు కలుగుజేస్తోందని తెలిపారు. దీన్ని నివారించాలంటే చికిత్సలో స్టెరాయిడ్ల దుర్వినియోగాన్ని నిలిపివేయాలని డాక్టర్ గులేరియా స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News