BTech Student: బీటెక్ విద్యార్థికి కరోనా పాజిటివ్... చెట్టుపైనే ఐసోలేషన్!

After tested corona positive BTech student shifted upon a tree for isolation

  • నల్గొండ జిల్లాలో ఘటన
  • కరోనా వ్యాప్తి కారణంగా నిలిచిన తరగతులు
  • ఇంటికే పరిమితమైన బీటెక్ విద్యార్థి శివానాయక్
  • ఇటీవలే కరోనా పాజిటివ్ నిర్ధారణ 
  • ఇంట్లో ఉన్నది ఒకే గది కావడంతో చెట్టుపై మకాం\

నల్గొండ జిల్లాలో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కరోనా బారినపడిన ఓ బీటెక్ విద్యార్థి చెట్టుపై నివాసం ఏర్పరచుకోవడం మీడియా కంటపడింది. అడవిదేవులపల్లి మండలం కొత్త నందికొండ గ్రామానికి చెందిన రమావత్ శివానాయక్ ఇంజినీరింగ్ విద్య అభ్యసిస్తున్నాడు. అయితే, కరోనా వ్యాప్తి కారణంగా తరగతులు నిలిచిపోవడంతో గత కొన్నినెలలుగా గ్రామంలోనే ఉంటూ కుటుంబసభ్యులతో కలిసి వ్యవసాయం చేస్తున్నాడు.

ఇటీవలే శివానాయక్ స్థానిక ఐకేపీ కేంద్రంలో ధాన్యం విక్రయించాడు. ఆ తర్వాత జ్వరం, ఒళ్లు నొప్పులతో బాధపడుతుండడంతో కరోనా టెస్టు చేయించగా, పాజిటివ్ అని వెల్లడైంది. అయితే, తమ ఇంట్లో ఉన్నది ఒకే గది కావడంతో ఐసోలేషన్ లో ఉండేందుకు తన ఇంటి సమీపంలోని చెట్టునే ఆవాసంగా మలుచుకున్నాడు. చెట్టుపై మంచాన్ని గట్టిగా తాళ్లతో కట్టి దానిపైనే విశ్రమిస్తూ ఐసోలేషన్ లో గడుపుతున్నాడు. గత 9 రోజులుగా ఇదే విధంగా చెట్టుపైనే శివానాయక్ మకాం ఉంటున్నాడు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News