Sudheer Babu: నా సిక్స్ ప్యాక్ గురించి మిగతా హీరోలు అడుగుతుంటారు: సుధీర్ బాబు

Other heros takes suggestions from Sudheer Babu

  • మొదటి నుంచి ఫిట్ నెస్ పై దృష్టి
  • యాక్షన్ హీరోగా మార్కులు పడ్డాయి
  • కొత్తదనం కోసం ట్రై చేశాను
  • మహేశ్ వెంటనే అభినందిస్తాడు

మొదటి నుంచి కూడా సుధీర్ బాబు విభిన్నమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు. కొన్ని సినిమాలు ఆయనకి మంచి విజయాలను అందించాయి. ఆయన తాజా చిత్రంగా 'శ్రీదేవి సోడా సెంటర్' రూపొందుతోంది. 'పలాసా' ఫేమ్ కరుణ కుమార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. పూర్తి గ్రామీణ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో, కథానాయికగా 'ఆనంది' అలరించనుంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి వదిలిన గ్లింప్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి సుధీర్ బాబు ప్రస్తావించాడు.

"నేను మొదటి నుంచి కూడా ఫిట్ నెస్ కి ప్రాధాన్యతనిస్తూ ఉంటాను. సిక్స్ ప్యాక్ అనేది నేను ఎప్పుడో ట్రై చేశాను. యాక్షన్ సినిమాలు మాత్రమే చేయగలడు అనే ముద్ర నుంచి బయటపడటం కోసం, 'ప్రేమకథా చిత్రం' వంటి సినిమాలు చేశాను. నేను చేసిన సినిమాలు నచ్చితే మహేశ్ బాబు వెంటనే కాల్ చేసి అభినందిస్తాడు. కృష్ణగారు మాత్రం చిన్నగా నవ్వుతారు. ఆ సినిమా ఆయనకి నచ్చిందని అప్పుడు అర్థమవుతుంది. ఇక నా ఫిట్ నెస్ సీక్రెట్ గురించి .. సిక్స్ ప్యాక్ గురించిన విషయాలను మిగతా హీరోలు కాల్ చేసి కనుక్కుంటూనే ఉంటారు. ప్రస్తుతం చేస్తున్న 'శ్రీదేవి సోడా సెంటర్' అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంది" అని చెప్పుకొచ్చాడు.

Sudheer Babu
Anandi
Sri Devi Soda Centre Movie
  • Loading...

More Telugu News