China: అంగారకుడిపై దిగిన చైనా వ్యోమనౌక.. ఆ ఘనత సాధించిన రెండో దేశంగా రికార్డుల్లోకి!

China has landed on Mars

  • చివరి దశకు చేరుకున్న తియాన్మెన్-1 ప్రయోగం
  • ‘ఉటోపియా ప్లానిషియా’లో కాలుమోపిన రోవర్, ల్యాండర్
  • ఇక జీవం ఆనవాళ్లపై పరిశోధన షురూ

అంగారకుడిపై జీవం ఆనవాళ్లపై పరిశోధన చేసేందుకు చైనా చేపట్టిన తియాన్వెన్-1 ప్రయోగం కీలక దశకు చేరుకుంది. ఇందులోని ల్యాండర్, రోవర్‌ అరుణగ్రహం ఉపరితలంపై  దిగాయి. ఇవి రెండు ఇప్పటికే అంగారకుడి కక్ష్యలో తిరుగుతున్నాయి. తియాన్వెన్ నుంచి విడిపోయిన రోవర్, ల్యాండర్ నిన్న సాయంత్రం సరిగ్గా 7.11 గంటలకు  గ్రహంపై నున్న ‘ఉటోపియా ప్లానిషియా’ అనే ప్రాంతంలో కాలుమోపాయి. కాగా, దీనిపై చైనా అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

వీటిపై కొన్ని వారాలపాటు పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత అవి అంగారకుడిపై జీవం ఆనవాళ్ల కోసం పరిశోధనలు మొదలుపెడతాయని చైనా పేర్కొంది. కాగా, ఇప్పటి వరకు అమెరికా మాత్రమే అంగారకుడి ఉపరితలంపై వ్యోమనౌకలను క్షేమంగా దించింది. ఇప్పుడు చైనా ల్యాండర్, రోవర్‌ను క్షేమంగా దించిన చైనా ఆ ఘనత సాధించిన రెండో దేశంగా రికార్డులకెక్కింది.

China
Mars
Tianwen-1
Rover
Lander
  • Loading...

More Telugu News