Andhra Pradesh: ఏపీలో వ్యాక్సిన్ కొనుగోళ్ల కోసం గ్లోబల్ టెండర్లకు ఆహ్వానం

AP govt goes for global tenders to procure corona vaccine doses

  • రాష్ట్రంలో తీవ్రస్థాయిలో వ్యాక్సిన్ల కొరత
  • కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్
  • జూన్ 3 వరకు బిడ్ల దాఖలుకు సమయం
  • ఇతర రాష్ట్రాలు కూడా గ్లోబల్ టెండర్లకు వెళుతున్నాయన్న సింఘాల్

ఏపీలో కరోనా వ్యాక్సిన్ కొరత తీవ్రంగా ఉన్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిపై రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ, వ్యాక్సిన్ కొనుగోళ్లకు గ్లోబల్ టెండర్లను ఆహ్వానిస్తున్నామని వెల్లడించారు. జూన్ 3 వరకు బిడ్లు దాఖలు చేసేందుకు సమయం ఉందని తెలిపారు. ఇతర రాష్ట్రాలు కూడా వ్యాక్సిన్ కొనుగోళ్లకు గ్లోబల్ టెండర్ విధానాన్ని అనుసరిస్తున్నాయని సింఘాల్ పేర్కొన్నారు.

ఇతర అంశాలపై స్పందిస్తూ, ఆక్సిజన్ కేటాయింపులు పెంచాలని కేంద్రాన్ని కోరామని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద కరోనా రోగులకు చికిత్స జరుగుతుందని స్పష్టం చేశారు. జిల్లాల్లో అదనంగా 25 శాతం వైద్య సిబ్బందిని నియమించాలని కలెక్టర్లకు సూచిస్తున్నామని సింఘాల్ వివరించారు.

  • Loading...

More Telugu News