icc: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో నంబ‌ర్ 1 భార‌త్!

India retain top spot in ICC Test Team rankings after annual update

  • న్యూజిలాండ్ ఒకే ఒక్క పాయింట్‌ వెన‌క‌బ‌డి రెండో స్థానానికి ప‌రిమితం
  • జ‌ట్టు ఖాతాలో ప్ర‌స్తుతం 120 పాయింట్లు
  • మూడో స్థానంలో ఇంగ్లండ్
  • నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా, ఐదో స్థానంలో పాకిస్థాన్

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో భార‌త జ‌ట్టు నంబ‌ర్ వ‌న్ స్థానాన్ని ప‌దిల‌ప‌ర్చుకుంది. తాజాగా విడుద‌ల చేసిన ర్యాకింగ్స్‌లో 121 పాయింట్ల‌తో టీమిండియా అగ్ర‌స్థానంలో నిల‌వ‌గా, అగ్ర‌స్థానానికి చేరుకుంటుంద‌ని భావించిన న్యూజిలాండ్ ఒకే ఒక్క పాయింట్‌తో వెన‌క‌బ‌డి రెండో స్థానానికి ప‌రిమిత‌మైంది. ఆ జ‌ట్టు ఖాతాలో ప్ర‌స్తుతం 120 పాయింట్లు ఉన్నాయి.

ఇక మూడో స్థానంలో 109 పాయింట్ల‌తో ఇంగ్లండ్, నాలుగో స్థానంలో ఆస్ట్రేలియా (108), 94 పాయింట్ల‌తో ఐదో స్థానంలో పాకిస్థాన్ ఉన్నాయి. ఆ త‌ర్వాతి స్థానాల్లో వ‌రుస‌గా వెస్టిండీస్, ద‌క్షిణాఫ్రికా, శ్రీ‌లంక‌, బంగ్లాదేశ్‌, జింబాబ్వే ఉన్నాయి.

ఏడాది వ్య‌వ‌ధిలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌పై భార‌త్ భారీ విజ‌యాలు సాధించిన విష‌యం తెలిసిందే. ఆస్ట్రేలియాపై 2-1 తేడాతో విజ‌యం సాధించింది. ఇంగ్లండ్‌లో 3-1 తేడాతో గెలుపొందింది. మ‌రోవైపు అదే కాల వ్య‌వ‌ధిలో న్యూజిలాండ్ వెస్టిండీస్‌పై 2-0 తేడాతో, పాకిస్థాన్‌తోనూ 2-0 తేడాతో విజ‌యాలు సాధించింది. ఈ నేప‌థ్యంలో భార‌త్, న్యూజిలాండ్ తొలి రెండు స్థానాల్లో కొన‌సాగుతున్నాయి.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News